శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (10:44 IST)

నో-ఫోన్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు.. అవన్నీ వాడితే అంతే సంగతులు

exams
ఏపీలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేలా చర్యలు చేపట్టింది. 
 
పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్‌లను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు నిరాకరించింది.
 
క్వశ్చన్ పేపర్లోని ప్రతి పేజీ మీద సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలెటర్లకు ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే అభ్యర్థులతో సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ రాయించాలని సూచించింది. పరీక్ష నిర్వహణలో ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
 
ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా కన్పిస్తే వెంటనే జప్తు చేస్తామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్లు, ఐపాడ్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని స్పష్టం చేసింది.