శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (12:03 IST)

కెనడా నుంచి వెనక్కి వచ్చిన పార్శిల్ - చెక్ చేస్తే డ్రగ్స్ భాగోతం

drugs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ మరోమారు కలకలం రేపాయి. కెనడాకు పంపించిన పార్శిల్ ఒకటి వెనక్కి తిరిగి వచ్చింది. దీన్ని విప్పి చూడగా డ్రగ్స్ భాగోతం వెలుగు చూసింది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇవి వెలుగు చూస్తూనే ఉన్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా విజయవాడ నుంచి ఓ కొరియర్ సంస్థ ద్వారా ఒక పార్శిల్‌ను ఆస్ట్రేలియాకు పంపించారు. అయితే, ఆ కొరియర్‌పై వివరాలు సక్రమంగా లేకపోవడంతో అది కెనడాకు వెళ్లిపోయింది. అక్కడ నుంచి అది తిరిగి వెనక్కి వచ్చింది. 
 
దీంతో అధికారులకు అనుమానం వచ్చి పార్శిల్‌ను విప్పి చూడగా అందులో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ కొరియన్‌ను ఆస్ట్రేలియాకు పంపిన వ్యక్తి పల్నాడు జిల్లా సత్తెనపల్లి వాసిగా గుర్తించారు. చెన్నై కేంద్రంగా ఎపిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.