శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (10:58 IST)

రైతులకు షాక్.. రూ.30లకు పడిపోయిన నిమ్మకాయ ధరలు

lemon
నిమ్మకాయ ధరలు పడిపోయాయి. కిలో నిమ్మకాయలు ప్రస్తుతం రూ.30లకే లభిస్తున్నాయి. మార్చిలో కిలో నిమ్మకాయలు 180 రూపాయలు పలికాయి. కానీ ఏప్రిల్‌లో వందకు తగ్గి.. మేలో ఏకంగా కిలో రూ.30కు పతనం కావడంపై రైతులు లబోదిబోమంటున్నారు. 
 
పంట మార్కెట్‌కు వచ్చే సమయంలో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి నిమ్మ ధర తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గిపోయిందని, ధర సైతం తగ్గిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. 
 
ధర అమాంతం తగ్గించి రైతుల నుంచి నిమ్మ పంటను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో మాత్రం నిమ్మ ధర ఏ మాత్రమూ తగ్గలేదు. డజను నిమ్మకాయలను సోమవారం రూ.వందకు విక్రయించారు. రైతులు, వినియోగదారులు నష్టపోతుండగా దళారులు భారీగా లాభపడుతున్నారు.