బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (09:14 IST)

అల్ప పీడనం.. రానున్న 46 గంటల్లో వర్షాలు.. అమరావతి వాతావరణ కేంద్రం

Rains
ఏపీలో రాగల 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
విదర్బ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడడంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల చల్లని వాతావరణం నెలకొందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 
 
దీంతో మే 4వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, 5న అల్పపీడనం ఏర్పడి ఆరు నాటికి బలపడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. 
 
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కడప, అనంత పురం, కర్నూలు, నెల్లూరు, నందిగామ, గన్న వరం, జంగమేశ్వరపురంలలో 41 డిగ్రీలు, అత్యల్పంగా కళింగపట్నంలో 32 డిగ్రీలు, విశాఖలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.