శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (14:16 IST)

ఫిర్యాదు చేసిందన్న కోపంతో బాలికను చెరబెట్టి శీలాన్ని చిదిమేశారు..

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. గతంలో తమపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ బాలికను చెరబెట్టిన కొందరు విద్యార్థులు బలవంతంగా పట్టుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన రాష్ట్రంలోని జమై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఓ బాలిక ఓ కోచింగ్ సెంటరులో ట్యూషన్‌కు వెళ్లుతుంది. ఇదే ట్యూషన్ సెంటరుకు వచ్చే కొందరు విద్యార్థులపై ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ బాలికపై కోపం ఐదుగురు విద్యార్థులు కోపం పెంచుకున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ట్యూషన్ సెంటరుకు వెళ్లి ఇంటికి వెళుతున్న సమయంలో ఆ బాలికను బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.