సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (21:05 IST)

ఢిల్లీలో దారుణ ఘటన: విద్యార్థినుల ముందే దుస్తులు.?

crime scene
ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. క్లాస్ రూమ్ డోర్ వేసి విద్యార్థుల ఎదుట వికృతంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
నిందితుడు స్కూలులోకి ప్రవేశించి ఓ గదిలోకి వెళ్లాడు. ఒక తరగతి గది డోర్‌ను లాక్ చేశాడు. ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తొలగించడమే కాకుండా వారిముందే మూత్ర విసర్జన కూడా చేశాడు. ఇలా పైశాచికంగా ప్రవర్తించడంతో అక్కడున్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. 
 
దీనిపై విద్యార్థులు యజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఢిల్లీ మహిళా కమిషన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్వాతి మలివాల్ పోలీసులను ఆదేశించారు.