గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 మే 2022 (19:34 IST)

డింపుల్ గ్లామ‌ర్ ఎలివేష‌న్స్‌

Dimple Hayati
Dimple Hayati
న‌టి డింపుల్ హ‌యాతి గురించి ఆమ‌ధ్య విడుద‌లైన ఖిలాడీ సినిమా నాయిక‌గా అంద‌రికీ తెలిసిందే. తెలుగు బాగా మాట్లాడే ఈ భామ చెన్నైలో వుంటుంది. ఖిలాడిలో స్విమ్ సూట్‌లో అల‌రించిన ఈ భామ ఇటీవ‌లే కొత్త ఫొటో షూట్ ఏర్పాటు చేసుకుంది. ఆ త‌ర్వాత విశాల్ స‌ర‌స‌న న‌టించినా అది అంతా హిట్ కాలేదు. దాంతో మ‌ర‌లా కెరీర్ మంద‌గించింది. అందాలు స‌మ‌పాల్ళ‌లో వున్న డింపుల్ భారీ ప్రాజెక్ట్‌ల‌లోనే ప‌నిచేయాల‌నే ఆలోచ‌న‌ను వ్య‌క్తం చేసింది.
 
కాగా, సీనియ‌ర్ హీరోయిన్ల త‌ర‌హాలో ఐటం సాంగ్ చేయ‌డానికి సిద్ధ‌మైంది. త‌మ‌న్నా, పూజా హెగ్గేవంటివారు కూడా ఐటెం సాంగ్ చేయ‌డంతో డింపుల్ కూడా ముందుకు వ‌చ్చింది. త్వ‌ర‌లో ఓ భారీ సినిమాలో ప్ర‌ముఖ హీరో సినిమాలో ఆమె డాన్స్ చేయ‌నుంది. గ్లామ‌ర్‌కు ఏ మాత్రం జంక‌ని ఈ భామ ఎటువంటి పాత్ర‌ల‌నైనా చేయ‌డానికి సిద్ధమ‌ని చెబుతోంది. త‌న సోష‌ల్‌మీడియాలో ప్ర‌త్యేక‌మైన ఫొటోలు పెట్టి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అల‌రిస్తోంది.