సంబంధిత వార్తలు
- గోవా బ్యాక్ డ్రాప్లోమేఘ ఆకాష్ చిత్రం
- "రామారావు ఆన్ డ్యూటీ" నుంచి 'బుల్ బుల్ తరంగ్' లిరికల్ సాంగ్ రిలీజ్
- అఖిరాకు నటనంటే ఇష్టంలేదంటున్న రేణుదేశాయ్
- విష్ణు విశాల్ హీరోగా రవితేజ సమర్పిస్తున్న చిత్రం మట్టి కుస్తీ
- అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో ప్రారంభమైన రవితేజ, టైగర్ నాగేశ్వరరావు చిత్రం
రావణాసుర భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి
Ravanasur location
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ లాయర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి ఫస్ట్ లుక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లకు ప్రాధాన్యత వుంది. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడు సుధీర్ వర్మ , మాస్ మహారాజా రవితేజని ఈ చిత్రంలో సరికొత్తగా చూపించబోతున్నారు.
ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ ద్వయం సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
తర్వాతి కథనం
