గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"రామారావు ఆన్ డ్యూటీ" నుంచి 'బుల్ బుల్ తరంగ్' లిరికల్ సాంగ్ రిలీజ్

rama rao on duty
మాస్ మహారాజా నటుడు రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ఫిబ్రవరిలో విడుదలైన 'ఖిలాడీ' తర్వాత ఇపుడు రామారావు ఆన్ డ్యూటీగా ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తొలి లిరికిల్ సింగిల్ 'బుల్బుల్ తరంగ్' పాటను తాజాగా చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. బుల్బుల్ తరంగ్, ఈ పాట రవితేజ పాత్ర బి. రామారావు యొక్క ఉద్వేగభరితమైన పార్శ్వాన్ని వర్ణిస్తుంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు.
 
ఈ రొమాన్స్ డ్రామాలో రవితేజ, రజిషా విజయన్ నటించారు. ఆకట్టుకునే కెమిస్ట్రీ ఈ పాటకు ఆకర్షణను పెంచుతుంది. శరత్ మండవ తొలిసారి రచన, దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి యొక్క ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్‌వర్క్స్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.