గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (18:21 IST)

సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డులు తిరగ రాసిన అల్లు అర్జున్ సామి సామి లిరికల్ సాంగ్

THUMB PUSHPA SAAMI SAAMI-30
ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప: ది రైజ్ సినిమాలోని మూడో పాట సామీ సామీ ఈ మధ్య విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాట రికార్డులు తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్ అత్యంత వేగంగా సాధించిన పాటగా సౌత్ ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది సామి సామి సాంగ్.
 
విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. మరే లిరికల్ వీడియోకు అయినా 24 గంటల్లో వచ్చిన అత్యధిక వ్యూస్ ఇవే.
 
పుష్ప సినిమాలోని మొదటి పాట దాక్కో దాక్కో మేక 24గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును సామీ సామీ తిరగరాసింది. అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి 6 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ లో 4 అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి.
 
ఇందులో మొదటి రెండు స్థానాల్లో సామి సామి,  దాక్కో దాక్కో మేక ఉన్నాయి. ఆ తర్వాత రాములో రాముల (7.37 million views), శ్రీవల్లి (7 million views) లిరికల్ వీడియోలు ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది.