సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (12:16 IST)

KGF Chapter 2 నుంచి Toofan Lyrical Song (Video)

కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'తూఫాన్' వచ్చేసింది. ఈ సాంగ్‌ను మార్చి 21 (నేడు) విడుదల చేశారు. 
 
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన సినిమా ఇది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది.
 
'కేజీఎఫ్ చాప్టర్ 1'తో భారీ హిట్ అందుకున్న యష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ సీక్వెల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలతో పాటు టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో ఈ మూవీ టీజర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది.
 
ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి తొలి సింగిల్ విడుదలైంది. ఈ సాంగ్‌ను వీడియో ద్వారా విని ఆస్వాదించండి.