శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (12:08 IST)

కేజీఎఫ్ 2కి ప్రమోషన్స్ ల్లేవ్.. అనవసరంగా ఎందుకు..?

కేజీఎఫ్ 2 వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాపై కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ ఈ సినిమాకు అనవసరమైన భారీ ప్రమోషన్స్‌ను దూరంగా పెట్టాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ నిర్ణయించింది. 
 
కేజీఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులు నిజంగానే ఆసక్తిగా ఉంటే, వారు ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది.
 
అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2కి సంబంధించి ఎలాంటి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు ఉండవని, కేవలం చిత్ర ట్రైలర్ రిలీజ్ మాత్రమే ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ ప్రకటనతో కేజీఎఫ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 
 
ఈ సినిమా నుండి భారీ ప్రమోషన్స్ కావాలని, తద్వారా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయని వారు అంటున్నారు. ఇక యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.