సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:09 IST)

బాలీవుడ్ హీరోల బాట‌లో ర‌వితేజ‌!

Ravi Teja
Ravi Teja
ఎన‌ర్జ‌టిక్ హీరోగా ర‌వితేజ‌కు పేరుంది. అందుకే మాస్ మ‌హారాజ అనే పేరును ఇండ‌స్ట్రీ ఆయ‌న‌కు ఇచ్చింది. సోలో హీరోగా ఎన్నో విజ‌యాలు ఇచ్చిన ఆయ‌న ఆ త‌ర్వాత కొన్ని ప్లాప్‌లూ ఇచ్చారు. అయినా ఆయ‌న కెరీర్‌లో ఎటువంటి మార్పు లేదు. క‌రోనా టైంలో కూడా మ‌లినేని గోపీచంద్‌తో పెద్ద హిట్ ఇచ్చాడు. దాంతో బిజీ అయిన ర‌వితేజ ఇప్పుడు ఏకంగా చిరంజీవికి పోటీగా ఐదు సినిమాల్లో సోలో హీరోగా న‌టించేస్తున్నాడు.
 
అయితే, చిరంజీవి, ద‌ర్శ‌కుడు బాబీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో ర‌వితేజ కూడా న‌టిస్తున్నాడు. ఇందుకు భారీగానే పారితోషికం తీసుకుంట‌న్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఇటీవ‌లే సోలో హీరోగా స్టూవ‌ర్ట్ పురం దొంగ జీవిత క‌థ‌ను టైగ‌ర్ నాగేశ్వ‌ర్‌గా ప్రారంభోత్స‌వం చేశారు. దీనితో ఐదు సినిమాలో ఆయ‌న చేతిలో వున్నాయి. అయితే ఆ త‌ర్వాత ర‌వితేజ ముందు చూపుతో బాలీవుడ్ త‌రహాలో మ‌ల్లీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించ‌నున్నాడ‌ని వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 
 
కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని దర్శకులకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ త‌ర‌హాలో తెలుగులో ఈమ‌ధ్య మ‌ల్టీస్టార‌ర్ క‌థలు వ‌స్తున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర్వాత చాలామంది హీరోలు ఆ త‌ర‌హా చిత్రాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఎలాగూ పాన్ ఇండియా సినిమాగా మారిపోయిన త‌రుణంలో ర‌వితేజ ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌బ‌బే అని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు.