ఆచార్య నైజాం హక్కులు వరంగల్ శీనుకే?
డిస్ట్రిబూటర్‌గా వరంగల్ శ్రీను హాట్‌టాపిక్‌గా మారాడు. గతంలో కొన్ని సినిమాలను నైజాంలో కొని విడుదల చేశారు. ఈ సందర్భంగా పలుసార్లు కాంట్రవర్సీ కూడా అయ్యాడు. నిజానికి నైజాంలో దిల్‌రాజు ఏకఛ్రతాధిపత్యంగా పంపిణీరంగంలో వుంటాడనే టాక్ వుంది. కరోనా టైంలో రవితేజ ‘క్రాక్’ కొన్ని సక్సెస్ సాధించాడు. దాంతో హాట్ టాపిక్‌గా మారాడు. అంతకుముందు అల్లరి నరేష్ ‘నాంది’, నితిన్ ‘చెక్’, విశాల్ ‘చక్ర’, కార్తీ ‘సుల్తాన్’ వంటి చిత్రాల నైజాం హక్కులను సొంతం చేసుకొని స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా మారాడు. ఇప్పుడు ‘ఆచార్య’తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
సమాచారం మేరకు నైజాంలోనే 42 కోట్లు చెల్లించి ఆ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు మంగళవారంనాడు మరోసారి హైదరాబాద్‌లో స్టార్ హోటల్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, రామ్‌చరణ్ కాంబినేషన్ కావడంతో కొరటాల శివ దర్శకుడు కావడంతో క్రేజీ సినిమాగా మారింది. ఇప్పటికే ఓవర్‌సీస్‌తో కలిపి అన్నిచోట్ల 135 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.