శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 మే 2022 (14:01 IST)

రామారావు ఆన్ డ్యూటీ నుండి సెకెండ్ సాంగ్ రాబోతోంది

Ravi Teja new look
Ravi Teja new look
రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధమౌతుంది. ఇప్పటికే  'రామారావు ఆన్ డ్యూటీ'  ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ 'బుల్ బుల్ తరంగ్' పాట విడుదలైన చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది.
 
ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఆకట్టుకుంది. ఈ పాటలో రవితేజ తనదైన శైలిలో హుషారుగా కనిపించి, డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ తో కూల్ అండ్ క్లాస్ గా అలరించారు. సింగింగ్ సంచలనం సిద్ శ్రీరాం వాయిస్ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
 
ఈరోజు ఈద్ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. రవితేజ ఒక మసీదు ముందునుండి తన అంబాసిడర్ కారు వైపు ఫుల్ ఎనర్జీటిక్ గా నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తుంది.  పోస్టర్ లో రవితేజ లుక్ సూపర్ ఫిట్ గా అభిమానులని అలరించింది.
 
ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ సొట్ట బుగ్గల్లో మే 7న విడుదల కానుంది. ఈ పాట అదిరిపోయే డ్యాన్సింగ్ సాంగ్ గా అలరించబోతుంది.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు.
 
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్