1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Royalakshmi running Janata Bar!

జనతాబార్ న‌డుపుతున్న రాయ్‌లక్ష్మీ!

Royalakshmi
Royalakshmi
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రం ‘జనతాబార్‌’ రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో రోచి శ్రీమూవీస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ నెల 5న కథానాయిక రాయ్‌ లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా చిత్రం టైటిల్‌ లోగోతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. 
 
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ ‘నాలుగు పాటల మినహా  షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ నెల ఎనిమిది నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆ పాటలను చిత్రీకరిస్తాం. స్పోర్ట్స్‌ నేపథ్యంలో జరగుతున్న అన్యాయాలను, లైంగిక వేధింపులకు ఓ యువతి చేసిన పోరాటమే ఈ చిత్రం. అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమాజానికి మంచి సందేశం కూడా వుంది. రాయ్‌లక్ష్మీ పాత్ర, ఆమె నటన చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. అన్నారు.  
 
శక్తికపూర్‌, ప్రదీప్‌రావత్‌, సురేష్‌, అనూప్‌సోని, అమన్‌*ప్రీత్‌, భూపాల్‌రాజ్‌, విజయ్‌భాస్కర్‌, దీక్షాపంత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యజమాన్య, కెమెరా: చిట్టిబాబు, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, మల్లేష్‌, అంజి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: రాజేంద్రభరద్వాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: అశ్వథ్‌ నారాయన, అజయ్‌గౌతమ్‌.
About Writer
డీవీ
తర్వాతి కథనం
జియోగేమ్స్‌లో "చోటా భీమ్".. వేసవిలో చిన్నారులకు బిగ్ ట్రీట్