మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (17:35 IST)

మ‌హేష్‌బాబుకు మ్యూజిక్ సెన్స్ వుంది - థ‌మ‌న్‌

Thaman
Thaman
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా పరశురాం పెట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట”. ఈ చిత్రంలో ఇప్ప‌టికే క‌ళావ‌తి, పెన్సీ పాట‌లు విడుద‌ల‌య్యాయి. అవి శ్రోత‌ల‌నుంచి అనూహ్య స్పంద‌న‌వ‌చ్చింది. దాంతో తామెంతో హ్యాపీగా వున్నామ‌ని సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ తెలియ‌జేస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని వివ‌రాలు తెలియ‌జేశారు.
 
మే 2న ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుంది. కంటెన్యూగా రెండు పాట‌లు విడుద‌ల కాబోతున్నాయి. మెలోడీ సాంగ్‌, మాస్ సాంగ్ అందులో వున్నాయి. మే 12 విడుద‌ల వ‌రకు ర‌క‌ర‌కాల ప్ర‌మోష‌న్స్ చేస్తూనే వుంటాయి. మ్యూజిక్ సిట్టింగ్ సంద‌ర్భంగానూ పాట‌ల‌ను పాడే గాయ‌కుల విష‌యంలో హీరో మ‌హేష్‌కు మంచి ప‌రిజ్ఞానం వుంది. అందుకే ఇప్ప‌టికి ఆడియో బాగా రావ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది. మ‌హేష్‌తో 6 ఏళ్ళ త‌ర్వాత చేస్తున్న సినిమా నాకు. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌తో ఆంజ‌నేయులు, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు చేశాను. స‌ర్కారివారి పాట మూడో సినిమా. ప్ర‌స్తుతం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ జ‌రుగుతోంది. అడ్వాన్స్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే పాట‌లు హిట్ కావ‌డంతో మాలో తెలీని ఉత్సాహం నింపారు మ‌హేష్‌బాబు. ఆయ‌న సినిమాకు ప‌నిచేయ‌డం సంతోషంగా వుంద‌ని తెలిపారు.