గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (20:49 IST)

థ‌మ‌న్ కోసం కాశ్మీర్ నుంచి బ్యాట్ తెచ్చిన‌ అనంత్‌శ్రీ‌రామ్‌

Anantha Sriram at kashmir
Anantha Sriram at kashmir
సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కోసం అభిమానంతో గీత ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ క్రికెట్ బ్యాట్‌ను తీసుకున్నారు. ఇది నాలుగు రోజుల‌నాడు క‌శ్మీర్‌లో ప్రెస్టీజియ‌స్ బ్యాట్స్‌ను త‌యారుచేసే క‌ర్మాగారంనుంచి ఆర్డ‌ర్ ఇచ్చి ఆయ‌నే స్వ‌యంగా తీసుకురావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని థ‌మ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేశారు. 
 
మ‌హేష్‌బాబు న‌టించిన స‌ర్కారు వారి పాటలో క‌ళావ‌తి.. సాంగ్‌ను అనంత శ్రీ‌రామ్ ర‌చించారు. మిగిలిన పాట‌ల‌కు మంచి సాహిత్యం అందించారు. క‌ళావ‌తి సాంగ్ అనూహ్య స్పంద‌న వ‌చ్చింది.  థమన్  క్రికెట్ ప్లేయర్ కాబట్టి, అనంత శ్రీరామ్ థమన్‌కి కస్టమ్ మేడ్ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. థమన్ ఆనందంగా ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు.
 
 మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ చిత్రం మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా  థియేటర్ల లో విడుదల కాబోతుంది.