1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. palnadu dist : son kills father for assets dispute

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

murder
ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేశాడో కుమారుడు. తాడికొండ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన వేల్పూరి శివయ్య (57) అనే వ్యక్తి ఈపూరు మండలం పొనుగోటివారి పాళెంలోన ఓ కోళ్లఫారంలో పనిచేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు నరేంద్ర, ఓ కుమార్తె ఉంది. కుమారుడుకి వివాహమైంది. ఆ తర్వాత కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. దీంతో శివయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 
 
అప్పుడప్పుడూ గ్రామంలోని తల్లిని చూసేందుకు వస్తుంటారు. ఈ నెల 9న రాత్రి 8.30 సమయంలో గ్రామంలోనే వేరుగా ఉంటున్న భార్య, పిల్లల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన పేరుపై ఉన్న 1.40 ఎకరం భూమి విషయంలో నరేంద్ర గొడవకు దిగాడు. ఆస్తి తనకు రాయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. 
 
ఆ తర్వాత నిద్రిస్తున్న తండ్రిని గొంతు నులిమి హతమార్చాడు. నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కాగా శివయ్య అనుమానాస్పద మృతిపై తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు