శుక్రవారం, 17 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మే 2022 (21:59 IST)

సారీ రా బంగారం... మహేష్ బాబుకు కీర్తి క్షమాపణలు!! (video)

keerthy suresh
"సర్కారు వారి" పాట సాంగ్ షూటింగ్ సందర్భంగా తనకు, మహేష్ బాబుకు మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ని టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తాజాగా షేర్ చేసుకుంది. ఇదే అంశంపై ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహేష్ బాబు తన పంచ్ డైలాగ్‌లతో ఆటపట్టించాడా? లేదా? అని కీర్తిని యాంకర్ ప్రశ్నించింది. 
 
ఈ ప్రశ్నకు కీర్తి సమాధానమిస్తూ, షూటింగ్ సమయాల్లో మహేష్ బాబు తనను చాలా ఆటపట్టించాడని, ఇది నిజంగా చాలా సరదాగా ఉన్నదని తెలిపింది. ఓ పాట షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయానని, స్టెప్పులు వేయలేదని, అదే సమయంలో మహేష్ బాబు తలని రెండుసార్లు కొట్టానని చెప్పింది.
SarkaaruVaariPaata
 
తాను అతనికి క్షమాపణలు చెప్పానని, అయితే మూడోసారి కూడా అదే పునరావృతమైందని ఆమె పేర్కొంది. ఈసారి మహేష్ బాబు తనపై పగ తీర్చుకుంటున్నావా? అని అడిగానని ఆమె తెలిపింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లు కలిసి నిర్మించాయి.