1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (09:54 IST)

భారతీయ సామాన్యుడుకి సెయింట్ హుడ్ పురస్కారం

devasahayam
భారతదేశంలో అప్పటి ట్రావెన్‌కోర్ రాజ్యంలో 18వ శతాబ్దంలో జన్మించిన క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దేవసహాయం పిళ్లైకు సెయింట్ హుడ్ లభించింది. ఆయనకు సెయింట్ (దేవదూత)గా ప్రకటిస్తూ వాటికన్ సిటీలోని క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఓ సామాన్య భారతీయుడికి అరుదైన గుర్తింపు లభించడంతో ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు. 
 
కాగా, దేవసహాయం పిళ్లైకు సెయింట్ హుడ్ ప్రకటించాలన్న తమిళనాడుకు చెందిన బిషప్ కౌన్సిల్, కేథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా సదస్సు అభ్యర్థన మేరకు 2004లో బీటిఫికేషన్ (పరమ ప్రాప్తి) వేడకకు దేవసహాయం పేరును ప్రతిపాదించింది. ఈ కారణంగా దేవసహాయంతో పాటు మరో 9 మంది పేర్లను మత గురువుల జాబితాలో చేర్చారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. 
 
కాగా, దేవసహాయం 23 ఏప్రిల్ 1712లో ట్రావెన్‌కోర్ రాజ్యంలో నట్టాళం గ్రామంలో హిందూ నాయర్ల కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు నీలకంఠన్ పిళ్లై అనే పేరు పెట్టగా, 1745లో క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆయన తన పేరును దేవసహాయంగా మార్చుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన కులవివక్షపై పోరాటం చేశారు. ట్రావెన్‌కోర్ మహారాజు మార్తాండ వర్మ కొలువు కీలకమైన అధికారిగా ఉన్న సమయంలో ఆయన మతమార్పిడి కారణంగా సంపన్నవర్గాల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆ సమయంలో ఆయన అనేక రకాలైన కఠిన శిక్షలను ఎదుర్కొని 1752 జనవరి 14వ తేదీన ఆయన్ను ఉరితీశారు.