మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (14:01 IST)

ఫేస్ బుక్ మారి... మోటాగా కొత్త ఫేస్!

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ త‌న పేరు మార్చుకుంది. ఇక‌పై మెటా పేరుతో సేవ‌లు అందించ‌నుంది. ఆ సంస్థ సీఈవో జుక‌ర్‌‌బర్గ్ తాజాగా ఈ విష‌యాన్ని ప్రక‌టిం‌చారు. భ‌విష్య‌త్తులో మెటా‌వర్స్ (వ‌ర్చువ‌ల్ రియాలిటీ) సాంకే‌తి‌కతకు పెర‌గ‌నున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈపేరు పెడుతున్న‌ట్టుగా స్ప‌ష్టం చేశారు.

 
ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ‌లైన వాట్సాప్, మెసేంజ‌ర్, ఇన్‌స్టాగ్రామ్ పేర్ల‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయ‌డం లేద‌ని జుక‌ర్ బ‌ర్గ్ తెలిపారు. ఈ సంస్థ‌ల‌న్నింటికి ఇన్నాళ్లు ఫేస్‌బుక్ మాతృ సంస్థ‌గా కొనసాగ‌గా.. ఇప్ప‌టి నుంచి మెటా ఆ స్థానంలో కొన‌సాగ‌నుంది. వర్చు‌వ‌ల్ రియా‌లి‌టీలో యూజ‌ర్లు సంభా‌షిం‌చు‌కొ‌నేలా ఫేస్‌బుక్ త‌న ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దుతోంది. త్వరలో సేవ‌లను అందు‌బా‌టు‌లోకి తీసు‌కు‌రా‌నుంది.

 
ఇదిలా ఉండ‌గా, ఫేస్ బుక్ స‌మాచార దుర్వినియోగానికి పాల్ప‌డుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతోనే, దాని నుంచి ప్ర‌పంచం దృష్టి మ‌ర‌ల్చేందుకు పేరు మార్పును ఫేస్ బుక్ తెర‌పైకి తెచ్చింద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.