బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (12:41 IST)

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ కమిటీ కన్వీనర్ కెప్టెన్ ప్రవీణ్ డావర్ కు స‌న్మానం

విజ‌య‌వాడ‌లోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాల‌యం ఆంధ్ర ర‌త్న భ‌వ‌న్ లో ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఏఐసీసీ 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ 50వ వార్షికోత్సవ కమిటీ కన్వీనర్ కెప్టెన్ ప్రవీణ్ డావర్ ని ఏపీసీసీ అధ్యక్షులు డా సాకే శైలజనాధ్ ఘన సన్మానం చేశారు. 
 
అ కార్య‌క్రమంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్ ఇంచార్జ్ పరస రాజీవ్ రతన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహారశెట్టి నరసింహారావు పాల్గొని కన్వీనర్ కెప్టెన్ ప్రవీణ్ డావర్ ని పూల‌మాల‌ల‌తో స‌త్క‌రించారు.
 
1971 యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించిన యుద్ధంలో పాల్గొన్న సైనికులకు సన్మానించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు గుంటూరులో నిర్వహించే కార్యక్రమానికి విచ్చేసిన ఆ కమిటీ జాతీయ కన్వీనర్ కెప్టెన్ ప్రవీణ్ డావర్ ని ఏపీసీసీ అధ్యక్షులు డా సాకే శైలజనాధ్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు ఆర్గనైజేషన్ ఇంచార్జి పరస రాజీవ్ రతన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహారశెట్టి నరసింహారావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేడా సురేష్ విజ‌య‌వాడ‌లో ఆహ్వానం ప‌లికారు. ఆయ‌న యుద్ధ స‌మ‌యంలో చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. బంగ్లాదేశ్ కు విముక్తి క‌లిగించిన ఆ యుద్ధంలో జ‌రిగిన విశేషాల‌ను మిటీ జాతీయ కన్వీనర్ కెప్టెన్ ప్రవీణ్ డావర్ వివ‌రించారు.