సీఎం కేసీఆర్ సర్కారుకు ఎన్జిటి బిగ్ షాక్ - ఆ ప్రాజెక్టులకు బ్రేక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ తేరుకోలేని షాకిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజాగా వెలువరించిన ఆదేశాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాల పేరుతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అయితే ప్రాజెక్టును సాగునీటి కోసం విస్తరించిందంటూ ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది అక్రమమంటూ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ ట్రైబ్యునల్ ఆదేశించింది. ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇపుడు తెలంగాణ సర్కారు ఏం చేస్తుందో వేచిచూడాలి.