గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (08:38 IST)

ఆ కుక్కకు కవిత ఏమైతరో అడగండి... ఆ మంత్రికి తల్లీ, చెల్లి లేరా?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్. షర్మిలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షర్మిలను మంగళవారం మరదలుతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. ఆ కుక్కకు సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత ఏమైతరో అని అడగండి అంటూ తమ పార్టీ కార్యక్తలకు పిలుపునిచ్చారు. 
 
'చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం. వాటి బుద్ధి ఎక్కడికి పోతుంది? సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఆ మంత్రికి భార్యాబిడ్డలు, తల్లీ, చెల్లి లేరా? కవిత (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) ఏమైతరో ఆ కుక్కను మీరే అడగండి' అంటూ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిపై షర్మిల విరుచుకుపడ్డారు. 
 
తాను చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలను ఉద్దేశించి మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమితరిమి కొట్టే రోజు చాలా త్వరలోనే వస్తుంది' అని అన్నారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు నుంచి మొదలై కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు సాగింది.