1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana : Lyric Writer Jangu Prahlad Passes away

రోడ్డు ప్రమాదంలో గేయ రచయిత జంగు ప్రహ్లాద్ మృతి

Telangana
తెలంగాణా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదమంలో గేయరచయిత, జన నాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగు ప్రహ్లాద్ మృతి చెందారు. ఆయన హైదరాబాదు‌లోని నిమ్స్ ఆస్పత్రి‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కానీ, ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
నిజానికి గురువారం బాగానే ఉన్న ఆయన... ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పోషించారు. ఆయన తెలంగాణా ఉద్యమంలో ఆట, పాటల ద్వారా కీలక భూమిక పోషించారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయన హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో ఉంటున్నారు. 
తర్వాతి కథనం
పేరు మార్చుకున్న ఫేస్‌బుక్.. ఇకపై...