1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (16:42 IST)

తెలంగాణ రోడ్లపై వాహనదారులను ఆపి వాట్సాప్ చెక్ చేస్తున్న పోలీసులు

వాట్సప్. ఇట్స్ వెరీ వెరీ పర్సనల్. ఇప్పుడా వాట్సప్ ఖాతాను తెలంగాణ పోలీసులు రోడ్లపై వాహనదారులను ఆపి మరీ చెక్ చేస్తున్నారు. అందులో గంజాయి అని టైప్ చేయమంటున్నారు. ఒకవేళ ఆ పదంతో ఏమైనా కనబడితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.


ఇదంతా ఎందుకంటే.. ఇటీవల గంజాయి కేసుల్లో పలువురు పట్టుబడటమే. అందువల్ల రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లేకుండా చేసేందుకే ఇలాంటి ఆదేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినట్లు చెపుతున్నారు.

 
ఐతే ఇలాంటి తనిఖీలపై చాలామంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వాట్సప్ గ్రూపుల్లో పర్సనల్ విషయాలు చాలా వుంటాయనీ, అవన్నీ పోలీసులు చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తాము అనుమానితులను మాత్రం చెక్ చేస్తున్నట్లు చెపుతున్నారు.