1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (11:02 IST)

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను : విమాన సర్వీసులు

అగ్రదేశం అమెరికాను మంచు తుఫాను గడగడలాడిస్తుంది. ఈ కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ముఖ్యంగా, న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా హిమపాతమే గుట్టలు గుట్టలుగా కనిపిస్తుంది. అటు రహదారులు, విమానాశ్రయాల్లో రన్‌వేలు పూర్తిగా మంచుతో నిండిపోయివుంది. దీంతో పలు నగరాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. దీంతో ప్రజలు రక్షణార్థం అమెరికా అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. మంచు తుఫాను ధాటికి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేశారు. 
 
ఇదిలావుంటే మంచు తుఫాను కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు విమానయాన సంస్థలు ప్రకటించాయి. దీంతో దాదాపు 4 వేల నుంచి 5 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. మున్ముందు హిమపాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. రేయింబవుళ్లు మంచు కురుస్తుండటంతో వీధులు, రోడ్లపై 30 సెంటీమీటర్ల మేరకు మంచు పేరుకునిపోయింది. దీంతో అనేక రాష్ట్రాల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలు చేపట్టారు.