1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:21 IST)

లఢక్‌ పెరుగుతున్న ఉద్రిక్తలు - భారీగా చైనా బలగాల మొహరింపు

తూర్పు లఢక్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా భారీగా బలగాలను మోహరిస్తుందని, ఇది ఆందోళనకర విషయమని భారత ఆర్మీ చీఫ్‌ నరవణె అన్నారు. చైనా చర్యలను అనుక్షణం గమనిస్తున్నామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తూర్పు లఢక్‌ వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘సరిహద్దులోని వాస్తవాదీన రేఖ వెంట చైనా నిర్మాణాలు చేపడుతున్నది. బలగాలను మోహరిస్తున్నది. భారత్‌ దగ్గరా అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని చైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చైనా మొండిగా వ్యవహరించినా.. ఎలాంటి చర్యలకు పాల్పడినా.. తగిన బుద్ధి చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధమే’ అని తెలిపారు.