మంగళవారం, 25 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (20:15 IST)

బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. పెన్షన్‌ను పెంచుతూ నిర్ణయం

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దేబశీష్‌ పాండా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్‌ పొందుతారు. దాంతో ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్‌ కాస్తా రూ.30,000-35,000కు పెరుగనున్నది.
 
ఇంతకుముందు వివిధ వర్గాల పెన్షనర్లకు 15, 20, 30 శాతం స్లాబ్‌ రేట్లలో చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌ను ఎలాంటి ఫిక్స్డ్‌ క్యాప్‌ లేకుండా మెరుగుపరచాలని ఇండియన్‌ బ్యాంకింగ్ అసోసియేషన్‌ (ఐబీఏ) ప్రభుత్వానికి నివేదించింది. దాంతో వేలాది బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఈ సిఫార్సును ఆమోదించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 
 
ఇదే సమయంలో, పెన్షన్‌ కార్పస్‌లో యజమాని సహకారాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది. దీంతో కరోనా సమయంలో మరణించిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు అందుతున్న పెన్షన్‌ 30 శాతం పెరిగింది. ఇది మరణించిన ఉద్యోగి చివరి జీతం ఆధారంగా జరిగింది.