శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (11:20 IST)

రాహుల్‌గాంధీకి ఫేస్‌బుక్‌ నోటీసులు జారీ: ఎందుకంటే?

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఫేస్‌బుక్‌ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హత్యాచార బాధితురాలి కుటుంబసభ్యుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుండి తొలగించాలని ఆదేశించింది.

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన పోస్ట్‌ జువైనల్‌ యాక్ట్‌ 2015 సెక్షన్‌ 74, పోక్సో చట్టం 2012 సెక్షన్‌ 23, ఐపిసిసెక్షన్‌ 288ఎల కింద చట్టవ్యతిరేకమని నోటీసులో పేర్కొంది. ఎన్‌సిపిసిఆర్‌ నోటీసులను పరిగణనలోకి తీసుకుని ఈ పోస్ట్‌ను తొలగించాల్సిందిగా ఆదేశించింది. 
 
రాహుల్‌ పోస్ట్‌పై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎన్‌సిపిసిఆర్‌) ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేసింది. లేకుంటే కమిషన్‌ ఎదుట హాజరు కావాలంటూ ఫేస్‌బుక్‌ సంస్థను ఆదేశించింది. ఇటీవల ట్విటర్‌ సంస్థ కూడా రాహుల్‌ ఖాతాను నిలిపివేసిన సంగతి తెలిసిందే.