1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:03 IST)

రాహుల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ఇప్పటికే బ్లాక్ కాగా.. త్వరలో రాహుల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఇన్​స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్)​ఫేస్​బుక్​ని ఓ లేఖలో ఆదేశించింది.

ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యుల వివరాలు బహిర్గతమయ్యేలా.. రాహుల్ పోస్ట్ చేసినందుకుగాను ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఫేస్ బుక్ కి రాసిన లేఖలో ఎన్సీపీసీఆర్ పేర్కొంది.
 
ఇన్​స్టాగ్రామ్​లో రాహుల్​ పోస్టు చేసిన ఓ వీడియోలో బాధిత బాలిక కుటుంబాన్ని గుర్తించేలా ఉంది. ఆ వీడియోలో బాలిక తల్లితండ్రులు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇది నిర్దేశించిన చట్టాలను ఉల్లంఘించడమే.

జువైనల్​ జస్టిస్​ యాక్ట్​-2015, పోక్సో చట్టం-2012, ఐపీసీలోని నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను రాహుల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ పై చర్యలు తీసుకోవాలి. సదరు వీడియోను వెంటనే తొలగించాలి అని ఫేస్​బుక్​కు రాసిన లేఖలో ఎన్​సీపీసీఆర్​ పేర్కొంది.