తాలిబన్లు ముమ్మాటికీ ఉగ్రవాదులే : నిషేధించిన ఫేస్‌బుక్
ఆప్ఘన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లను ప్రముఖ సామాజికమాద్యం ఫేస్‌బుక్ ఉగ్రవాదులుగా ముద్రవేసింది. దీంతో తాలిబన్లను చెందిన అన్ని ఖాతాలను నిషేధించింది. ఇదే బాటలో ట్విట్టర్ కూడా పయనించే అవకాశం ఉంది.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల ఆఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని తాలిబన్ ప్రతినిధి ట్విటర్ వేదికగానే ప్రకటించారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది.
వారికి సంబంధించిన కంటెంట్ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, తాలిబన్లు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ మెసేజ్లను పంపే వాట్సాప్‌ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేక పోవడం గమనార్హం.