గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:41 IST)

అమ్యూజ్ మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు (Video)

Amusement park
కాబూల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు మస్తు మజా చేశారు. కాబూల్ సిటీలోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. భుజాలపై రైఫిళ్లను మాత్రం వదలని వారు-ఈ పార్కుల్లోని ఎలెక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
అలాగే ఇదే పార్కులో పిల్లలు ఆడుకునే చిన్నపాటి బొమ్మ గుర్రాలపై 'స్వారీ' చేస్తూ వీళ్ళు కనిపించారు.నగర విమానాశ్రయంలో ఓ వైపు కనబడిన విమానమల్లా ఎక్కేందుకు పరుగులు తీస్తున్న ప్రజలతో విపరీతమైన రద్దీ, గందరగోళం ఏర్పడుతుండగా మరోవైపు వీళ్ళలో కొంతమంది ఇలా పార్కుల బాట పట్టడం విశేషం. వీరిలో కొందరు ఫైటర్లు దేశంలో చిక్కుబడిన అమెరికన్ల తరలింపులో అమెరికా సైనిక దళాలకు సాయపడ్డారట. 
 
భాషా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ట్రాన్స్ లేటర్లుగా మారి ఆ సమస్యను తీర్చారట.. బహుశా ఈ కారణం వల్ల కూడా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాలిబన్ల పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారని భావించవలసి వస్తుందంటున్నారు. 
 
ఆఫ్ఘన్‌లో పరిస్థితికి తాను ఎంతమాత్రం కారకుడు కాదని ఆయన పదేపదే చెబుతున్నారు. ఇలా ఉండగా కాబూల్ లోని పార్లమెంట్ భవనంలో తాలిబన్లు తిష్ట వేసిన దృశ్యాల వీడియోలు, మజారే షరీఫ్‌లో మాజీ ఆఫ్ఘన్ సైనికాధికారి హిబాతుల్లా అలీ జాయ్ విలాసవంతమైన నివాసంలో వీరు తిరుగాడుతున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి.