మంగళవారం, 25 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (11:46 IST)

ప్రభుత్వ పాఠశాలల్లో 4 లక్షలకు పైగా పెరిగిన అడ్మిషన్లు

స‌ర్కారు బ‌డులు అంటే... వానాకాలం చ‌దువులు, అక్క‌డ చ‌దివిస్తే పిల్లాడు దెబ్బ‌తిని పోతాడ‌ని గ‌తంలో నానుడి. కానీ, నేడు ఏపీలో ప్ర‌భుత్వ పాఠశాల‌ల రూపు రేఖ‌లు మారిపోతున్నాయంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు... ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 4 లక్షలకు పైగా అడ్మిషన్లు పెరిగాయ‌ట‌.
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ "నాడు-నేడు" పథకం, ఇంగ్లిష్ మీడియం అమలు చేయడం కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గతంలో కంటే 4 లక్షలకు పైగా పెరిగాయ‌ట‌. గతంలో చంద్రబాబు విద్య ప్రభుత్వ బాధ్య‌త‌ కాదన్న‌ట్లు, దానిని కార్పోరేట్లే తమ బుజస్కందాలపై వేసుకోవాలని చెప్పి ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేశార‌ని ఆరోపిస్తున్నారు.
 
నేడు సీఎం జగన్  హ‌యాంలో మ‌నం మన పిల్లలకిచ్చే అతి పెద్ద ఆస్ది చదువొక్కటే అనే భావ‌న తెచ్చార‌ని, చిద్రమైపోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్ధకు కొత్త రూపునిస్తున్నార‌ని పేర్కొంటున్నారు. ఒక్క విద్యారంగాన్నే కాకుండా...దానితో పాటుగా వైద్య రంగంలో కూడా నాడు నేడు కార్యక్రమాన్ని చేపడుతూ ఈ వ్యవస్ధకు కొత్త రూపునిస్తున్నారు.

ఇటీవ‌ల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు త‌మ రూపు మార్చుకుని, కార్పొరేట్ కి ధీటుగా త‌యార‌వుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో అమలౌతున్న విద్యా విధానాలను పొరుగు రాష్ట్రాలు సైతం మెచ్చుకుని, తాము కూడా ఈ విధానాలను అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయ‌ని చెపుతున్నారు. ఏపీలో ఒక వర్గం మీడియాకి ఇవేమీ కనబడనట్టుగా ప్రభుత్వంపై అను నిత్యం బురదజల్లుతూనే ఉన్నాయ‌ని మండిప‌డుతున్నారు.