సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 11 మే 2021 (18:36 IST)

2021 బ్యాచ్‌ కోసం నిట్‌ యూనివర్శిటీ ఏఐపీ సరళమైన అడ్మిషన్‌ ప్రక్రియ

నిట్‌ యూనివర్శిటీ ఇప్పుడు వినూత్నమైన ఆన్‌లైన్‌ అడ్మి షన్‌ ఇంటరాక్షన్‌ ప్రక్రియ(ఏఐపీ)ను ఆరంభించింది. యూనివర్శిటీలో చేరగోరు విద్యార్థులకు సౌకర్యవంతమైన దరఖాస్తు ప్రక్రియను ఇది అందిస్తుంది. ఈ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ఇంటరాక్షన్‌ ప్రక్రియ రెండు మార్గాల ప్రక్రియ. ఇది విద్యార్థులను వారి విద్యా రికార్డుల పరంగా మాత్రమే గాక వారి సమగ్ర వ్యక్తిత్వం, ఆసక్తి, కోరిక ఆధారంగా పరిశీలిస్తుంది. విద్యార్థులు తమ 10వ తరగతి స్కోర్‌, వ్యక్తిగత సంభాషణ ఆధారంగా తమ 12వ తరగతి బోర్డు ఫలితాలతో సంబంధం లేకుండా అడ్మిషన్‌  పొందవచ్చు.
 
ఈ ఏఐపీలో మూడు ప్రధాన విభాగాలుంటాయి. అవి విద్యార్థుల కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, కెరీర్‌ లక్ష్యాలు, స్వీయ అవగాహనను అంచనా వేస్తూ ప్రశ్నావళి; అప్టిట్యూడ్‌ పరీక్ష, లాజికల్‌ రీజనింగ్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షిస్తూ ఎన్‌యు ఏటీ ఎంసీక్యు చివరగా విద్యార్థులతో ముఖాముఖి సంభాషణల ద్వారా వారి భవిష్యత్‌ లక్ష్యాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను అంచనా వేస్తారు.
 
నిట్‌ యూనివర్శిటీ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ పరిమల్‌ మండ్కే మాట్లాడుతూ, ‘‘పీర్‌ టు పీర్‌ అభ్యాసాన్ని ప్రోత్సహించే రీతిలో వాతావరణం సృష్టించడానికి ఎన్‌యు ప్రయత్నిస్తుంటుంది. ఈ ఏఐపీ అలా చేసేందుకు మాకు వీలు కల్పించింది. ఈ ప్రక్రియ విద్యార్థులను అంచనా వేయడంతో పాటుగా విద్యార్థుల కోరికలు, ఇనిస్టిట్యూషన్స్‌ ఆఫరింగ్స్‌ నడుమ సమతుల్యతను సృష్టించేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు.