ఏపీలో ఇంటర్ ప్రవేశాలకు నయా రూల్స్ - తెలంగాణాలో జూలై 5 తర్వాతే స్కూల్స్

kcr-jagan
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 29 మే 2020 (11:23 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ కేసుల నమోదులో చైనానా భారత్ దాటిపోయింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ క్రమంలో పలు రాష్ట్రాలు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సర్కారు ఆసక్తికరమైన మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఇంటర్ ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి నిబంధనలు సవరించారు. ఇకపై ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీచేశారు.

ఇందుకోసం ఆయన జీవో 23ని విడుదల చేశారు. కనిష్టంగా 4 సెక్షన్లకు 160 మంది, గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది… ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 720 మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ఈ పరిమితి గరిష్టంగా 1584 మంది వరకు ఉండేదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కాలేజీలపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

జూలై 5 తర్వాతే స్కూల్స్ రీఓపెన్
ఇకపోతే, రాష్ట్రంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలను దశలవారీగా తెరవాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా, జూలై 5 వరకు టెన్త్ పరీక్షలు జరగనుండటంతో.. ఆ తర్వాతే స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.

అయితే ఒకేసారి కాకుండా మొదటిగా 8,9,10 తరగతులు ప్రారంభించి.. ఆ సమయంలో ఏవైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే.. వాటిని సరిదిద్దుకుని 6,7 తరగతులను ప్రారంభించనున్నారు. ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు.

2020-21 విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలన్న దానిపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.



దీనిపై మరింత చదవండి :