శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (18:52 IST)

2021 బ్యాచ్‌ కోసం ముందుగా అడ్మిషన్లను ప్రకటించిన ఎన్‌యు

లాభాపేక్ష లేని ఎన్‌ఐఐటీ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ నాలుగు సంవత్సరాల ప్రోగ్రామ్స్‌ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, డాటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ), 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ (మార్కెటింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఎనలిటిక్స్‌, ఎంటర్‌‌ప్రిన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ బ్యాకింగ్‌ అండ్‌ ఫిన్‌టెక్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్, కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీస్‌, డిజిటల్‌ అండ్‌ సోషల్‌ మీడియా మార్కెటింగ్‌), 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ(కంప్యూటర్‌ సైన్స్‌), 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ మరియు మూడు సంవత్సరాల బీబీఏ; 2 సంవత్సరాల ఎంటెక్‌ (ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ మరియు జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌)లో ముందస్తు దరఖాస్తులు (ఈఏడీ) ప్రకటించింది.
 
ఎన్‌యు వద్ద ఈ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి niituniversity.in. చూడవచ్చు. పరిశ్రమ అనుసంధానిత, సాంకేతిక ఆధారిత, పరిశోధనతో నడిచే మరియు సౌకర్యవంతమైన విద్య అనే నాలుగు మూల సిద్ధాంతాల ఆధారంగా నిట్‌ యూనివర్శిటీ విద్యను అందిస్తుంది. ఎన్‌యుకు చెందిన ప్రోగ్రామ్‌లన్నీ కూడా కనీసం ఆరు నెలల ఇండస్ట్రీ ప్రాక్టీస్‌ (ఐపీ)ని కలిగి ఉంటాయి. ప్రోగ్రామ్‌ చివరి సెమిస్టర్‌లో ఇది ఉంటుంది. ఎన్‌యుకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ఈ ఐపీని దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మక  సంస్థలలో చేశారు.
 
ప్రతిభావంతులైన విద్యార్థులకు పూర్తిగా మద్దతునందించడంలో భాగంగా ఎన్‌యు ఇప్పుడు పూర్తి వైవిధ్యమైన రీతిలో ఎన్‌యు స్కాలర్‌ సెర్చ్‌ ప్రోగ్రామ్‌ను సైతం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం క్రింద దరఖాస్తుదారులు తమ 10/12/జెఈఈ ఫలితాలను అనుసరించి యూనివర్శిటీ ట్యూషన్‌ ఫీజును పూర్తిగా మినహాయింపు పొందవచ్చు.
 
నిట్‌ యూనివర్శిటీ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌, పరిమల్‌ మండ్కీ మాట్లాడుతూ ‘‘మా విద్యార్థులందరికీ సమగ్రమైన, పరిశ్రమ అనుసంధానిత విద్యను అందించాలని ఎన్‌యు వద్ద మేము లక్ష్యంగా చేసుకున్నాం. భవిష్యత్‌ అవసరాలకు తగిన నైపుణ్యాలను మేము విద్యార్థులకు అందిస్తున్నాం. మేము మా క్యాంపస్‌ను తెరిచాం. ఎంతో మంది విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగివచ్చారు. గత సంవత్సరం చాలా కష్టంగా ఉన్నప్పటికీ మేము విద్యార్థులను సానుకూలంగా ప్రేరేపించాము. వారి వాస్తవ ప్రతిభను వెల్లడి చేసుకునేందుకు వర్ట్యువల్‌ వేదికలనూ అందించాము’’ అని అన్నారు.