శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:47 IST)

నవీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమకథ.. త్వరలో టీజర్

Nenu Leni Prema Katha
నవీన్ చంద్ర హీరోగా సురేశ్ ఉత్తరాది తెరకెక్కించిన సినిమా 'నేను లేని నా ప్రేమకథ'. గత యేడాది కరోనా పాండమిక్ సిట్యుయేషన్ లో ఈ మూవీని తెరకెక్కించామని, అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఫైనల్ ప్రాడక్ట్ చక్కగా వచ్చేలా కృషి చేశామని దర్శకుడు సురేశ్ ఉత్తరాది తెలిపారు. 
 
ఈ చిత్రానికి జువెన్ సింగ్ స్వరాలను, రాంబాబు గోశాల సాహిత్యాన్ని అందించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్, ఎన్.కె. భూపతి సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని నిర్మాతలు కళ్యాణ్ కందుకూరి, నిమ్మకాయల దుర్గాప్రసాద్ రెడ్డి, డా. అన్నదాత భాస్కర్రావు చెప్పారు. 
 
ఈ సరికొత్త ప్రేమకథ ఔట్ పుట్ చూసి మెచ్చి యు.ఎఫ్.ఓ. సంస్థ డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌గా ముందుకు వచ్చిందని వారు చెప్పారు. అలానే జెమినీ రికార్డ్స్ మొదటిసారిగా ఆడియో రంగంలోకి వస్తూ, ఈ మూవీ ఆడియో హక్కులను సొంతం చేసుకుందని అన్నారు. 
 
త్వరలోనే టీజర్ ను విడుదల చేయడంతో పాటు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుతామని అన్నారు. నవీన్ చంద్రతో పాటు గాయత్రి ఆర్ సురేశ్, అదితీ మ్యాకల్, రాజా రవీంద్ర, షైనీ, రామ్ విన్నకోట తదితరులు ఈచిత్రంలో కీలక పాత్రలను పోషించారు.