మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:30 IST)

టీజ‌ర్ లో `రిప‌బ్లిక్‌` తీవ్ర‌త అర్థ‌మ‌యింది హిట్ గేరంటీ: సుకుమార్ (video)‌

Sukumar
సాయితేజ్‌, దేవ్ క‌ట్ట కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టులు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈసినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. టీజ‌ర్‌ను సోమ‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ విడుద‌ల చేశారు. 
 
అనంత‌రం సుకుమార్ మాట్లాడుతూ, `ప్ర‌స్థానం` వ‌చ్చిన‌ప్పుడు దేవ్‌ను క‌లిసి మాట్లాడాను. ఇప్ప‌టికీ ఆ సినిమాను మ‌నం మ‌ర‌చిపోలేదంటే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్‌, నెరేష‌న్ అంత గొప్ప‌గా ఉంటాయి. అలాంటి సినిమాకు ఇచ్చిన దేవాకు థాంక్స్‌. `రిప‌బ్లిక్‌` క‌థ‌ను దేవా నాకు చెబుతానంటే. వ‌ద్ద‌ని అన్నాను. అందుకు కార‌ణం, ఓ మంచి ద‌ర్శ‌కుడి క‌థ‌ను విన‌డం కంటే చూడాల‌ని నేను అనుకోవ‌డ‌మే. విజ‌న్‌ను మిస్ కాకూడ‌ద‌ని అనుకున్నాను. థియేట‌ర్‌లోనే సినిమాను చూడాల‌ని అనుకున్నాను. టీజ‌ర్ అద్భుతంగా ఉంది. పాండమిక్ టైమ్‌లో అంద‌రూ భ‌య‌ప‌డుతుంటే సాయి. `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చాడు. `ఉప్పెన`లాంటి సినిమాను రిలీజ్ చేయ‌గ‌లిగామంటే కార‌ణం ఆ ధైర్యాన్ని సాయి ఇచ్చిందే. టీజ‌ర్‌లో ఓ షాట్ చాలు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాల‌నుకుంటున్నాడో. చాలా ఇన్‌టెన్స్ ఉంది. సాయితేజ్ స‌హా యూనిట్‌కి, భ‌గ‌వాన్‌గారికి, పుల్లారావుగారికి ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
 
చిత్ర నిర్మాత జె.పుల్లారావు మాట్లాడుతూ, హీరో సాయితేజ్‌తో తొమ్మిదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాం. ఆ ప్ర‌తిఫ‌ల‌మే ఇది. ఈ ట్రావెల్‌లో సాయితేజ్‌తో చాలా క‌థ‌లు డిస్క‌స్ చేసుకున్నాం. అయితే ఏదీ సెట్ కాలేదు. ఇప్పుడు అన్నీ చ‌క్క‌గా కుదిరితే రిప‌బ్లిక్ సినిమా రూపొందుతోంది. చాలా హ్యాపీగా ఉన్నాం. క‌రోనా ముందు పూజా కార్య‌క్ర‌మాలు స్టార్ట్ చేశాం. క‌రోనా త‌ర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆ దేవుడు ఆశీస్సులు, మెగా ఫ్యామిలీ స‌పోర్ట్‌తో ఈ సినిమాను ప్రారంభించాం. క‌రోనా టైమ్‌లో మా టెక్నీషియ‌న్స్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశాం. ద‌ర్శ‌కుడు దేవ్‌గారు సినిమా గురించి అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారు అన్నారు.
 
చిత్ర నిర్మాత జె.భగవాన్ మాట్లాడుతూ - ``సుకుమార్‌గారి చేతుల మీదుగా మా `రిప‌బ్లిక్` సినిమా టీజ‌ర్ విడుద‌ల అవ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్ప‌గా తీయ‌డానికి హీరో సాయితేజ్‌, డైరెక్ట‌ర్ దేవాక‌ట్ట‌, ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. 
 
Republic teaser team
డైరెక్ట‌ర్ దేవ్ క‌ట్ట మాట్లాడుతూ, `నేను సుక్కు సార్‌గారికి ఏక‌ల‌వ్య శిష్యుడిని. ఆయ‌న చేసి వ‌ర్క‌వుట్ కానీ సినిమాలు కూడా ఎంతో గొప్ప‌గా ఉంటాయి. ఆయ‌న డైరెక్ట్ చేసిన `రంగ‌స్థ‌లం` చాలా ఇష్టం. ఓ ల్యాండ్ మార్క్ మూవీ అది. `బాహుబ‌లి` ఎంత ల్యాండ్ మార్క్ మూవీనో `రంగ‌స్థ‌లం` కూడా అంతే ల్యాండ్ మార్క్ మూవీ. క‌థ‌పై న‌మ్మ‌కం, స్టార్‌డ‌మ్ అన్నింటిపై న‌మ్మ‌కం పెంచిన చిత్రం `రంగ‌స్థ‌లం`. చాలా గేట్లు ఓపెన్ అయ్యాయి. ఆ సినిమా కార‌ణంగానే నేను రిప‌బ్లిక్ సినిమా చేశాను. నేను ఈ స్థానంలో ఉండి మాట్లాడ‌టానికి చాలా కాలం ప‌ట్టింది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎక్కువ‌గా ఈ స్థానంలో ఉండి మాట్లాడుతాన‌ని అనుకుంటున్నాను. నా తేజ్‌, నా నిర్మాత‌లు, నా టీమ్ కార‌ణంగానే రిప‌బ్లిక్ సినిమా పూర్త‌య్యింది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత మీ అంద‌రి జీవితాల్లో భాగ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు. 
 
సాయితేజ్ మాట్లాడుతూ, క‌థ విన‌మంటే దేవాపై చాలా న‌మ్మ‌కం ఉంద‌ని సుకుమార్ అన్నారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్‌గారికి థాంక్స్‌. సుకుమార్‌గారు టీచ‌ర్ అయితే, బుచ్చిబాబు ఫ‌స్ట్ బెంచ్ స్టూడెంట్‌.. దేవాగారు మిడిల్ బెంచ్‌, నేను లాస్ట్ బెంచ్‌. హానెస్ట్ అటెంప్ట్ చేశాం. క‌చ్చితంగా అంద‌రికీ రీచ్ అవుతుంద‌ని, ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను టచ్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. మా ప్రొడ్యూస‌ర్స్ భ‌గ‌వాన్‌గారు, పుల్లారావుగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మంచి స‌పోర్ట్‌ను అందించారు. మ‌ణిశ‌ర్మ‌గారు అమేజింగ్ వ‌ర్క్ ఇచ్చారు. ఆయ‌న‌తో ఎప్ప‌టి నుంచో ప‌నిచేయాల‌ని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ  కోరిక తీరింది. మంచి మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమారన్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. మా దేవాగారితో 2016 చివ‌ర‌లో ప్రయాణం స్టార్ట్ అయితే, ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. దేవాగారితో పని చేయ‌డం ల‌వ్ లీ ఎక్స్‌పీరియెన్స్‌. ప్ర‌తిదీ న‌న్ను బాగా ప్రిపేర్ చేశారు. అద్భుత‌మైన అవ‌కాశం ఇచ్చారు. ఫ్యాన్స్ ఇచ్చిన స‌పోర్ట్‌తోనే ఈ సినిమాను ధైర్యంగా చేయ‌గ‌లిగాను``అన్నారు. 
 
న‌టీన‌టులు:
సాయితేజ్
ఐశ్వ‌ర్యా రాజేశ్‌
జ‌గ‌ప‌తిబాబు
ర‌మ్య‌కృష్ణ‌
సుబ్బ‌రాజు
రాహుల్ రామ‌కృష్ణ‌
బాక్స‌ర్ దిన 
 
సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  దేవ్ క‌ట్టా
స్క్రీన్‌ప్లే:  దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌
మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
ఎడిట‌ర్‌:  కె.ఎల్‌.ప్ర‌వీణ్