గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (19:16 IST)

రిలీఫ్ కోసం వంట‌శాల‌లో చిరు, నాగ్

Chiru, nag
మెగాస్టార్ చిరంజీవికి ఖాళీ దొరికితే చాలు వంట‌గ‌దిలో వంట‌వాడిగా మారిపోతాడు. ఆమ‌ధ్య క‌రోనా లాక్‌డౌన్‌లో దోసెలువేస్తూ అభిమానుల‌ను అల‌రించాడు. వీలున్న‌ప్పుడు కిచెన్‌లో చికెన్‌కూడా వండుతుంటాడు. మంచి భ‌ర్తేకాకుండా మంచి వంట‌వాడిగా ఆయ‌న భార్య సురేఖ బిరుదుకూడా ఇస్తుంటుంది. ఇక స్నేహితుడు నాగార్జున‌తో క‌లిసి వంట‌వండాల్సివ‌స్తే ఇంకేముంది. చికెన్‌కు ప‌ని చెప్ప‌డ‌మే. చిరంజీవి సినిమా ఆచార్య విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం వుంది. చాలా కూల్‌గా వున్నాడు. కానీ నాగార్జున అంత కూల్‌గా లేడు.

అందుకే రేపు వైల్డ్‌డాగ్ సినిమా విడుద‌ల కానున్నంద‌న‌గా సాయంత్ర‌మే చిరంజీవి ఇంటికి వెళ్లి హాయిగా రుచిక‌ర‌మైన విందు త‌యారుచేసుకుని ఆరగించారు. ఈ వంట‌గ‌దిలో వున్న ఈ వంటావార్పూను మెగాస్టార్ భార్య సురేఖ వీడియోలో బంధించి ఫొటో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. చిరంజీవి రుచిక‌ర‌మైన వంటంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అప్పుడ‌ప్పుడు ఇలా క‌లుస్తుంటామ‌ని నాగ్ ట్వీట్ చేశాడు. సో. సినిమా విడుద‌ల‌కుముందు వున్న టెన్ష‌న్ను ఈ ర‌కంగా స్నేహితునితో షేర్‌చేసుకుంటూ రిలీఫ్‌గా వుంటాడ‌న్న‌మాట‌.‌