వైల్డ్‌డాగ్ ఏప్రిల్‌ఫూల్ చేసింది.
ఏప్రిల్ ఫస్ట్ అనగానే. ఏప్రిల్ ఫూల్ చేసేరోజు. దీనిపై గతంలో రకరకాలుగా దినపత్రికలలో ప్రభుత్వపరంగా వార్తలు రాసి మొదటి పేజీలో అచ్చువేసేవారు. ఆసక్తిగా పాఠకులు చదివేందుకు పూర్తి వార్త పలానా పేజీలో వుందని రాయగానే అక్కడికి వెళ్ళగానే.. మరో చోట అని రాసేశారు. ఫైనల్‌గా.. ఇది ఫూల్ చేయడానికి అని తెలిపేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. పేపర్లలో చదివే ఓపిక లేకపోవడంతో నాగార్జున వినూత్నంగా ఓ ఐడియాతో తన సినిమా ప్రమోషన్‌ను చేసుకున్నాడు.
ఈరోజే ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మేట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అందులో కనిపిస్తుంది. ఆ తర్వాత నటీనటులు అలీ, సైయామి ఖేర్ కనిపిస్తారు. పైరసీని అరికట్టండి, థియేటర్లలోనే చూడండి అని చెబుతారు. ఆ వెంటనే `హ్యాపీ ఏప్రిల్ ఫూల్ డే`అంటూ టైటిల్ పడుతుంది. సో.. నాగార్జున క్రియేషన్ అదన్నమాట. మరి రేపు థియేటర్లలో జనాలు ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి.