సంబంధిత వార్తలు
- సచిన్‌కు కరోనా.. నా ఫేవరేట్ ప్రత్యర్థి త్వరలో కోలుకావాలి.. అక్తర్
- కెనడాలో తెలంగాణ విద్యార్థి బలవన్మరణం
- ఇద్దరు బాలికలు .. 8 మంది యువకులు.. అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్
- స్థాయికి తగిన కథను పవన్ ఎంచుకున్నారుః శ్రీరామ్ వేణు
- ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్.. మడతబెట్టే ఫోన్లకు గట్టిపోటీ
39 ఏళ్ల ఆటంకాలను దాటిన ' ప్రతిబింబాలు'
Pratibimbalu movie
ఈ చిత్రం కొంత భాగాన్ని అలనాటి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాష్ రావు, ఇంకొంత భాగాన్ని మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం గురించి నిర్మాత రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, "ఆనాడు మేము కొత్తదనంగా ఫీలయి ఈ చిత్ర కధాంశాన్ని ఎన్నుకొన్నామో, ఈనాటికీ అటువంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. మా సినిమా చూసి ప్రతి ఒక్కరు ఫ్రెష్ నెస్ ఫీలవుతారు. యంగ్ లుక్ లో నాగేశ్వరరావు గారి నటన ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఆయనతో జయసుధ పోటీపడి నటించారు. అక్కినేని అభిమానులనే కాకుండా ప్రతిఒక్కరిననీ ఈ చిత్రం అలరిస్తుంది. అప్పటి ప్రముఖ నటీ నటులు ఇందులో నటించారు. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని తెలిపారు.
ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు, జయసుధ, తులసి, గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, రామనుజచారి, సాక్షిరంగారావు, అశోక్ కుమార్, అన్నపూర్ణ, పుష్పలత, జయమాలిని, అనురాధ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి కథ: జె.ఆర్.కె.మూర్తి, స్క్రీన్ ప్లే, మాటలు: ఆత్రేయ, పాటలు: వేటూరి, సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాధ్, ఎడిటింగ్: వీరప్ప వి.ఎస్. నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, దర్శకత్వం: కె. ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు.
తర్వాతి కథనం
