శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (10:21 IST)

నడిచింది నేను.. నడిపించింది మీరే - బండి సంజయ్‌కు ప్రధాని మోడీ

bandi sanjay
భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను రెండు విడతలుగా పూర్తి చేశారు. ఈ రెండు విడతల్లో దాదాపు 800 కిలోమీటర్ల మేరకు బండి సంజయ్ నడిచారు. శనివారం నాడు రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ పూర్తి చేశారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. 
 
మరోవైపు, పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న బండి సంజయ్‌కు ప్రధాని మోడీ అభినందించారు. బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఆదివారం స్వయంగా ఫోన్ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతుండగా, మోడీ నుంచి ఫోన్ వచ్చింది. పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని బండిని ప్రధాని ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా బండి సంజయ్ సమాధానమిస్తూ, మీ స్ఫూర్తి, సూచనలతో పాదయాత్ర చేపట్టానని, రెండు విడతల్లో 770 కిలోమీటర్లు నడిచానని తెలిపారు. నడిచింది తానే అయినా నడిపించింది మాత్రం మీరేని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఆగ్రహం మొదలైందని, నీతివంతమైన పాలన కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్నారంటూ సమాధానమిచ్చారు.