గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (13:07 IST)

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత.. సుప్రీం కోర్టు

ab venkateswara rao
ab venkateswara rao
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరి 8న విధుల్లోంచి తొలగించింది. 
 
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏబీవీ కోర్టులలో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు గత నెలలో ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోటానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సస్పెన్షన్ రద్దయ్యింది.
 
ఏబీవీ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది పిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పి విచారణ ముగించింది. ఏబీవీ ఫిబ్రవరి 8నుంచి సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు రావలసిన ప్రయోజనాలు అన్నీ కల్పించాలని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్నాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏబీవీ సస్పెన్షన్ ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.