శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (14:51 IST)

తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు కృష్ణా బోర్డు ఫుల్ స్టాప్

Water
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది.ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తిని నియంత్రణ, నిర్వహణ నియమావళి ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తే జల వివాదాలకు తావే ఉండదని కృష్ణా బోర్డు భావిస్తోంది.
 
మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఈనెల 20న హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సమావేశమవుతోంది.
 
ఈ నేపథ్యంలో కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి జలాలు కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశంపైన కూడా అధ్యయనం చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని ఆదేశించింది. ఆర్‌ఎంసీ నివేదికను బోర్డులో చర్చించి.. అమలు చేయడం ద్వారా జల వివాదాలకు చరమగీతం పాడాలని నిర్ణయించింది.