సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (09:11 IST)

నేడు కోర్టులో లొంగిపోనున్న నవజ్యోత్ సింగ్

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ తీర్పులో సిద్ధూకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన కోర్టులో లొంగిపోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పాటియాలా కోర్టులో పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉంది. తాను కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని సిద్ధు సూత్రప్రాయంగా వెల్లడించి, అమృతసర్ నుంచి పాటియాలాలోని తన ఇంటికి చేరుకున్నారు. 
 
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు తనకు ఇంకా అందలేని ఆయన ఓ ప్రశ్నకు తెలిపారు. శుక్రవారం ఉదయం చండీఘడ్ కోర్టు నుంచి పాటియాలో పోలీస్ స్టేషన్‌కు వస్తాయని తెలిపారు. ఆ తర్వాత ఆ సమన్లను సిద్ధూకు అందించి లొంగిపోవాలని కోరుతామన్నారు. అరెస్టు చేసిన వెంటనే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలిస్తామని ఆయన తెలిపారు.