సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 మే 2022 (15:49 IST)

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి : వైకాపా ఎమ్మెల్సీపై హత్య కేసు

murder
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత భాస్కర్ బాబుపై హత్య కేసు నమోదు చేసినట్టు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేయగా, ఇపుడు దాన్ని హత్య కేసుగా నమోదు చేశామన్నారు. 
 
అనంతబాబుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 302 కింద కూడా కేసు నమోదు చేశామన్నారు. అలాగే, అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్టు ఆచూకీ తెలుసుకున్నట్టు తెలిపారు.