సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 మే 2022 (20:22 IST)

హైదరాబాదులో నాగరాజు హత్య: జి-మెయిల్ లాగిన్ చేసి ఫైండ్ మై డివైస్ సహాయంతో హత్య చేసారు

murder
హైదరాబాదులోని సరూర్ నగర్‌లో కులాంతర వివాహం చేసుకున్న నాగరాజును పక్కా వ్యూహంతో హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగరాజు తన సోదరి ఆశ్రిన్‌ను వివాహం చేసుకున్న దగ్గర్నుంచి చాలా జాగ్రత్తగా వుంటున్నాడు. దీనితో అతడిని మట్టుబెట్టాలన్న మొబిన్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అతడి జి-మెయిల్ తీసుకుని నాగరాజు ఫోన్ నెంబరే పాస్ వర్డ్ పెట్టి వుంటాడన్న ఆలోచనతో ప్రయత్నించాడు. 

 
జి-మెయిల్ లాగిన్ సఫలం కావడంతో... దానిలోపలకెళ్లి ఫైండ్ మై డివైస్ ఆఫ్షన్ బటన్ నొక్కాడు. దాంతో నాగరాజు ఎక్కడున్నది తెలుసుకున్నాడు. మొబిన్... తన బావ అహ్మద్ సాయంతో ఈ నెల 4న నాగరాజును హత్య చేసారు. ఈ హత్యలో ఇంకెవరి హస్తం లేదని పోలీసులు వెల్లడించారు.