మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (20:45 IST)

వివో నుంచి సరికొత్త Vivo Y75 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్

Vivo Y75
Vivo Y75
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. కొత్త వీవో వై75 44-ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 50-ఎంపీ వెనుక కెమెరా ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఫోటోగ్రఫీ ఇష్టపడేవారిని ఈ స్మార్ట్ ఫోన్ మరింత ఆకర్షించేలా ఉంది. 
 
ఇక ఈ ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఎక్కువగా ట్రావెల్స్ చేసేవారైతే వివో వై75 స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. 
 
మూన్‌లైట్ షాడో డ్యాన్సింగ్ వేవ్స్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వచ్చింది. అందులో యూనిక్ వేరియంట్ వీవో వీ75 ధర రూ. 20,999గా ఉంది. వై75 స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్, వీవో ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.
 
ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా.. అతి తక్కువ ధరకే యూజర్లను ఆకట్టుకునేలా స్పెసిఫికేషన్‌లతో వచ్చింది.